త్రిపురాంతకం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

85చూసినవారు
త్రిపురాంతకం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద శుక్రవారం రెండు కార్లు ఢీకొనగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రక్షించే క్రమంలో ఓ లారీ డ్రైవర్ రోడ్డు పక్కన లారీని నిలిపి గాయపడ్డ వారికి సహాయం చేస్తుండగా ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీ కొట్టింది. ఘటనలో లారీలో ప్రయాణిస్తున్న శ్రీను (32) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ వారిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్