ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీద పల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన శుక్రవారం సాయంత్రం జరగగా శనివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఇరు వర్గాలు పొలం వివాదంలో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో శ్రీను అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.