ప్రకాశం: పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం
కేసులకు ఏమాత్రం భయపడేది లేదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. శనివారం రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమలరావును అమరావతిలో కలిసి తనపై అక్రమంగా కేసు పెట్టారని ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.