దోర్నాల పట్టణంలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో నూతనంగా మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక ప్రజలు ఈ ప్రాంతంలో మద్యం దుకాణం వద్దంటూ రోడ్డుపై బైఠాయించి శుక్రవారం నిరసనకు దిగారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులతో మాట్లాడారు. ఎక్సైజ్ శాఖ అధికారులు రంగ ప్రవేశం చేసి ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. దీంతో ప్రజలు శాంతించారు.