
పెద్ద దోర్నాల: నాటు సారా బట్టీలు ధ్వంసం
పెద్ద దోర్నాల మండలం పనుకుమడుగు చెంచు గ్రామంలో నాటు సారా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది గాలింపు నిర్వహించి 400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. నాటు సారా తయారీ నిలువ విక్రయంపై కఠిన చర్యలు ఉంటాయని దోషులకు ఎనిమిది ఏళ్ల జైలు శిక్ష రూ. 5 లక్షల జరిమానా విధించబడుతుందని అధికారులు హెచ్చరించారు.