పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ మహబూబ్ నగర్ కు ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం కురుమూర్తి స్వామిని దర్శంచుకున్న రేవంత్ మీడియాతో మాట్లాడారు. 'త్వరలోనే మక్తల్, నారాయణ్ పేట్, కొండగల్ ప్రాజెక్టులు ప్రారంభిస్తాం. నాపై కోపముంటే రాజకీయంగా కాకుండా వేరే విధంగా చూపండి. నా జిల్లాను అభివృద్ధి చేసుకోవనివ్వండి. ఇన్నాళ్లూ మీ నియోజక వర్గాలకు నిధులు తీసుకెళ్తే మేము పడి ఏడ్వలేదు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. మమ్మల్ని అభివృద్ధి చేసుకోనివ్వండి' అని అన్నారు.