
ఎర్రగొండపాలెం: పాదయాత్ర భక్తులకు ఉచిత అన్నదానం
ఎర్రగొండపాలెం: శ్రీ మల్లికార్జున స్వామి ఆశ్రమంలో శ్రీశైలం వెళ్లే పాదాచార భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విపిఆర్ ఫౌండేషన్ చైర్మన్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సాకారంతో గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఉగాది సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులకు ప్రత్యేకంగా అన్నదానం అందించామని నిర్వాహకులు మాలపాటి బాలిరెడ్డి తెలిపారు.