పెద్ద దోర్నాల: దీపావళి టపాసులు నిలువ ఉంచిన వ్యక్తిపై కేసు
పెద్ద దోర్నాల లోని పలు దుకాణాలపై స్థానిక ఎస్సై మహేష్ ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఓ దుకాణంలో అనుమతులు లేకుండా నిలువ ఉంచిన దీపావళి టపాసులను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్సై ఆదివారం వెల్లడించారు. దీపావళి టపాసులు విక్రయించే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అలా కాదని దీపావళి టపాసులు విక్రయించిన, నిలువ ఉంచిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మహేష్ హెచ్చరించారు.