AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపైన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నవరాత్రుల్లో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుసుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే దుర్గగుడిపై నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది అధికారులు నడుచుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎటువంటి అర్హత లేకపోయినా వైసీపీ నాయకుడు పోతిన మహేష్ కు ప్రోటో కాల్ దర్శనం కల్పించారు. సాక్షాత్తు ఈవో అమ్మవారి ఫోటో ఇచ్చి మరీ వేద ఆశీర్వాదం చేయించడం సర్వత్ర చర్చనీయాంశమైంది.