మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మద్దతుతో ఫడ్నవీస్ సీఎం కాబోతున్నారని చెప్పుకొచ్చారు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అనంతరం అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచే ప్రకటన రావాల్సి ఉందని పేర్కొన్నారు.