ఏపీని వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం గురువారం తీరం దాటింది. కాస్త ఊపిరి పీల్చుకున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరంగా వానలు పడతాయని పేర్కొంది.