AP: ఎట్టకేలకు రుషికొండకు సంకెళ్లు వీడుతున్నాయి. రుషికొండ దక్షిణం వైపు ఘాట్ రోడ్డును ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పునఃప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రజలకు అవసరమైన విధంగా పర్యాటక ప్రదేశాల్లో రహదారుల అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. రుషికొండ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఈ రహదారి ఎంతో సదుపాయంగా ఉంటుందన్నారు.