రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా పేలిన టైర్.. ఎగిరి పడ్డాడు (వీడియో)

68చూసినవారు
కర్ణాటక రాష్ట్రం ఉడిపిలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. రిపేర్ చేస్తుండగా టైర్‌ పేలిపోవడంతో ఓ మెకానిక్‌ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి కిందపడిపోయాడు. NH 66లోని కోటేశ్వర్ సమీపంలో పంక్చర్ షాపు వద్ద ఈ ఘటన జరిగింది. అబ్దుల్ రజీద్ (19) అనే మెకానిక్ ఓ స్కూల్ బస్సు టైర్‌కు పంక్చర్ వేస్తున్న సమయంలో టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. రజీద్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఈనెల 21న జరగ్గా, ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్