యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అలీఘర్‌లోని విజయ్‌గఢ్‌లో సోమవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు స్టీరింగ్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 12 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ విద్యార్థులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా స్కూల్ బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.