కడపలో ఫ్లెక్సీ వార్ (వీడియో)

82చూసినవారు
AP: మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో కుర్చీ వివాదంపై కడప నగరంలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ‘హూ ఈజ్ జయశ్రీ’, ‘మహిళలు అంటే చిన్న చూపా’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డికి సీటు వేయకుండా నిలబెట్టడంపై ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఒక మహిళా ఎమ్మెల్యేకు గౌరవం లేదా? జయశ్రీ పేరు మీద రెండు ఫ్లోర్లకు అనుమతి తీసుకుని నాలుగు ఫ్లోర్లు కట్టారంటూ ఫ్లెక్సీలలో రాసుకొచ్చారు. కాగా, కడప నగర మేయర్ సతీష్ బాబు సతీమణి జయశ్రీ.

సంబంధిత పోస్ట్