పూజా ఖేడ్కర్‌కు ముందస్తు బెయిల్‌ నిరాకరణ

58చూసినవారు
పూజా ఖేడ్కర్‌కు ముందస్తు బెయిల్‌ నిరాకరణ
యూపీఎస్సీ చీటింగ్‌ కేసులో మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్‌ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్