షర్మిలక్క కేంద్ర మంత్రిగానట...!

59చూసినవారు
షర్మిలక్క కేంద్ర మంత్రిగానట...!
రాజకీయాల్లో అసలు నిజాలు కంటే ఊహాగానాలకే ప్రచారం ఎక్కువ. వైఎస్ షర్మిల అన్న ఆమె ఈ రోజుకు చూస్తే కనుక కేరాఫ్ వైఎస్సార్ అనే చెప్పుకోవాలి. ఆమె కూడా తాను రాజన్న బిడ్డను అని చెప్పుకుంటోంది. ఇక ఆమె చెప్పుకోక పోయినా మరో కేరాఫ్ ఏంటి అంటే ఏపీ ప్రస్తుత సీఎం జగన్ సోదరిగా ఆమెకు గుర్తింపు. ఇక ఏపీలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్నది చర్చకే రావడం లేదు. కాంగ్రెస్ కి ఈసారి ఒకటో రెండో శాతం ఓట్లు వస్తాయని లెక్క వేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర మంత్రిగా షర్మిలక్క అని కడపలో ప్రచారం చేస్తున్నారుట.

సంబంధిత పోస్ట్