దుర్గామాత ఉత్సవాలు ఖండాంతరాలు దాటాయి. సోమవారం రాత్రి న్యూయార్క్ నగరంలోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ వద్ద తొలిసారిగా దుర్గాపూజ నిర్వహించారు. ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని ఎంతో సందడిగా గడిపారు. చుట్టూ భారీ భవనాలు, ప్రత్యేక లైటింగ్ నడుమ ఏర్పాటు చేసిన సెట్లో దుర్గమ్మను ఉంచారు. మండపం వద్ద స్పెషల్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి భక్తి గీతాలు ఆలపించిన అద్భుతమైన వీడియో వైరలవుతోంది.