AP: గంజాయి స్మగ్లర్లు బరి తెగించారు. ఏకంగా అటవీశాఖకు చెందిన 15 ఎకరాల భూమిలోనే గంజాయి సాగు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం వనభంగిలోని అటవీ భూమిలో గంజాయి సాగును పోలీసులు డ్రోన్ సహాయంతో గుర్తించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సూచనలతో రెవెన్యూ, అటవీశాఖ, పోలీసుల సమన్వయంతో గంజాయి మొక్కలను ధ్వంసం చేసి తగులబెట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.