తెలంగాణలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాడ్వాయి మండలంలోని దేవాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయిరెడ్డి (47) చిన్న కొడుకు ఇంటి నిర్మాణం కొరకు అప్పులు చేసి చనిపోవడంతో.. ఆ అప్పుల భారం సాయిరెడ్డిపై పడింది. ఈ అప్పులు తీర్చలేక పాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.