షావోమీ ఇండియా ప్రెసిడెంట్ పదవికి మురళీ కృష్ణన్ రాజీనామా చేశారు. ఆరేళ్లుగా ఈ పదవిలో ఉన్న మురళి ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర సలహాదారుగా కొనసాగనున్నారు. 2028లో Xiaomi ఇండియాలో మురళి కృష్ణన్ చేరారు. 2022లో ప్రెసిడెంట్ కావడానికి ముందు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌తో సహా సంస్థలో పలు కీలక పదవుల్లో పనిచేశారు. మురళి వారసుడిని షావోమీ ఇండియా ఇంకా ప్రకటించలేదు.