ఆత్మకూరు: సివి రామన్ కు నివాళులు

57చూసినవారు
ఆత్మకూరు: సివి రామన్ కు నివాళులు
ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ వర్ధంతి సందర్భంగా గురువారం చిలకలమర్రి జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం సురేష్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రామన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు , విద్యార్థులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉపాధ్యాయుడు చల్లా చంద్రశేఖర్ రెడ్డి సివి రామన్ సైన్స్ పై చేసిన పరిశోధనలను వివరించారు. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త రామన్ అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.