కావలి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కావలి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు సోమవారం కలిశారు. గత 15 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సులుగా కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.