వందల సంఖ్యలో ప్రజలతో ప్రభుత్వ కార్యాలయాలకు మాలేపాటి

61చూసినవారు
వందల సంఖ్యలో ప్రజలతో ప్రభుత్వ కార్యాలయాలకు మాలేపాటి
దగదర్తి మండలం ఎస్సై, ఎంఆర్ఓ, ఎంపిడిఓ, పలువురు ఉన్నత స్థాయి అధికారులను రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు, దగదర్తి టిడిపి నేత మాలేపాటి సుబ్బానాయుడు సోమవారం కలిశారు. వందల సంఖ్యలో దగదర్తి ప్రజలతో ఆయన కార్యాలయాలకు వెళ్లారు. గత ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పలువురికి అర్హులైనప్పటికీ పెన్షన్ రాకుండా చేశారని, కొందరిపై అక్రమ కేసులు బనాయించారని వారందరికీ న్యాయం చేయాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్