నెల్లూరు: పట్టాలు మంజూరు చేయాలంటూ సిపిఎం నిరాహార దీక్ష

82చూసినవారు
నెల్లూరు: పట్టాలు మంజూరు చేయాలంటూ సిపిఎం నిరాహార దీక్ష
నెల్లూరు నగరంలోని 53, 54 డివిజన్లో నివాసముంటున్న వారికి రిజిస్ట్రేషన్ పట్టాలు మంజూరు చేయాలంటూ.. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో వెంకటేశ్వరపురం సెంటర్లో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా నివాసముంటున్న వారికి బి ఫాం పట్టాలు ఉన్నాయని, అవి దేనికి ఉపయోగపడకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్