నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, 36వ డివిజన్ ఇన్ చార్జ్ పిండి సురేష్ వారి సతీమణి స్థానిక కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ, తదితరులు ఆదివారం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పిండి సురేష్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.