నెల్లూరులో ఆసక్తికర పరిణామం జరిగింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉన్న విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో వేడి రాజేస్తున్నారు. రోజూ ఏదో ఓ చోట వీరిద్దరూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇవాళ రంజాన్ కావడంతో బారాషాహిద్ దర్గాకు ఇద్దరూ వచ్చారు. పక్కపక్కనే కూర్చొని ప్రార్థనలు చేయడం విశేషం.