సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 30న కేబినెట్ భేటీ

75చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 30న కేబినెట్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో రైతు భరోసా, కొత్త రేషన్‌ కార్డుల జారీ విధి విధానాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. భూమిలేని నిరుపేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుపై చర్చించనున్నారు. అయితే సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని సీఎం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించగా.. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్