నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం 53, 54 డివిజన్లో నివాసముంటున్న ప్రజలకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయాలని కోరుతూ శనివారం సిపిఎం నాయకులు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచారు. రిజిస్ట్రేషన్ పట్టాలు మంజూరు చేయాలంటూ వెంకటేశ్వరపురం సెంటర్లో నవంబర్ 4వ తేదీన సిపిఎం ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేస్తున్నామని, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు తెలిపారు.