విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ.. సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నెల్లూరులోని విఆర్సి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వెన్ను నరేంద్ర మాట్లాడుతూ.. డిగ్రీ విద్యార్థులకు బకాయిలు ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు.