సూర్యప్రభ వాహనంపై కొలువైన వెంకయ్య స్వామి

67చూసినవారు
సూర్యప్రభ వాహనంపై కొలువైన వెంకయ్య స్వామి
వెంకటాచలం మండలంలోని గొలగమూడి గ్రామంలో వెలసియున్న వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామికి సూర్యప్రభ వాహన సేవ జరిగింది. పూలతో అత్యంత సుందరంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై కొలువైన వెంకయ్య స్వామిని దర్శించుకున్న భక్తులు ఆనంద పారవశ్యంలో తేలియాడారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సూర్యప్రభ వాహన సేవకు సన్నారెడ్డి కృష్ణారెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్