దుత్తలూరు మండలం సోమరేగడ వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. దుత్తలూరు నుంచి ఉదయగిరి వైపు వెళ్తున్న ఒక కారు అదుపు తప్పి జాతియ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి ను ఢీ కొట్టి లోపల పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పలువురికి గాయాలవ్వగా వారిని 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఉదయం సమయం కావడంతో బ్రిడ్జ్ ను గుర్తించలేక ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.