జనసేన పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా విభాగం అధ్యక్షులు, జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ సారధ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి 2 లక్షల రూపాయల చెక్కును ఉదయగిరి జనసేన పార్టీ నాయకులు, నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు శుక్రవారం అందజేశారు. పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలకరించి కొన్ని పార్టీ సంబంధిత కార్యక్రమాలను గురించి డిస్కస్ చేసినట్లు కాశీరావు తెలిపారు.