కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా మంగళవారం అంగరంగ వైభోగంగా చెన్నకేశవ స్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని టిడిపి నేత అంబటి సురేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. కొమ్మి గ్రామంలోని అన్ని వీధుల్లో ఊరేగింపు కార్యక్రమాన్ని అంబటి సురేంద్ర దగ్గరుండి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.