ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం ఉదయగిరి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పురాతన ఆలయాలను సందర్శించారు. ఉదయగిరికి ఘనమైన చరిత్ర ఉందని ఆ చరిత్రను కాపాడి భావితరాలకు అందించాలన్నారు. సుమారు 365 దేవాలయాలు ఉదయగిరిలో ఉన్నాయని రాష్ట్ర నలుమూలల ఎక్కడ ఇలాంటి దేవాలయాలు లేవన్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు పర్యాటక శాఖ మంత్రితో చర్చించి అభివృద్ధి చేస్తానన్నారు.