ఉదయగిరి మండలం పరిధిలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో సుమారు అరగంట సేపు మోస్తారు వర్షం కురిసింది. భారీ వర్షం లేకపోవడంతో రైతులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా అకస్మాత్తుగా దీపావళి సందర్భంగా టపాసులు కొనడానికి ఉదయగిరి వచ్చిన ప్రజలు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, వాగులు కొంతమేర నిండాయి. మరోసారి భారీ వర్షం పడితే పైరులు పెట్టాలని రైతులు ఆకాంక్ష్మించారు.