బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉదయగిరి మండల వ్యాప్తంగా గురువారం రాత్రి సమయంలో మోస్తారు వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘామృతమై ఉన్నప్పటికీ చిరుజల్లులు తప్ప వర్షం పడలేదు. దీంతో రైతులు తీవ్ర నిరుస్తాహానికి గురయ్యారు. అలాంటి సమయంలో రాత్రి వర్షం కురవడం రైతులకు కొంతమేర ఆనందాన్ని కలిగించింది. కాగా ఆత్మకూరు, కావలి, సంఘం వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.