సంగం శ్రీనివాసులు సేవలు అమోఘం: మేయర్ వసీం

82చూసినవారు
సంగం శ్రీనివాసులు సేవలు అమోఘం: మేయర్ వసీం
అనంతపురం నగర పాలక సంస్థ కార్యదర్శిగా సంగం శ్రీనివాసులు అందించిన సేవలు అమోఘమని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం కొనియాడారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళుతున్నటువంటి సంగం శ్రీనివాసులకు శుక్రవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం భాస్కర్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.