ధర్మవరంలో జరిగిన జాబ్ మేళాలో ఎంపికైన వారికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం నియామక పత్రాలు అందజేశారు. 5, 120 మంది జాబ్ మేళాకు హాజరు కాగా, 99 కంపెనీల ప్రతినిధులు 1, 668 మందిని ఎంపిక చేశారు. వచ్చిన అవకాశాన్ని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని, లక్ష్యాన్ని అధిగమించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ పాల్గొన్నారు.