గుత్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి వీరశేఖర్ జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు కళాశాల కరెస్పాండెంట్ వీకే పద్మావతమ్మ తెలిపారు. ఆమె మాట్లాడుతూ. నెల్లూరులో జేఎన్టీయూ నిర్వహించిన ఖోఖో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు అర్హత సాధించాడని ఆమె తెలిపారు. కళాశాల యాజమాన్యం విద్యార్థిని అభినందించారు.