పెన్నా నదిలో తాగు నీటి కార్మికుల జల దీక్ష

79చూసినవారు
గత ఏడు రోజులుగా సత్యసాయి జిల్లా తాగు నీటి కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం నాటికీ 8 రోజులకు చేరింది. ఇందులో భాగంగా పామిడి పట్టణంలోని పెన్నా నదిలో సత్యసాయి జిల్లా తాగునీటి కార్మికులు జల దీక్ష చేపట్టారు. తమకు ప్రభుత్వం చెల్లించవలసిన ఐదు నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తాగునీటి కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని తాగునీటి పథకానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలన్నారు.

సంబంధిత పోస్ట్