శ్రీసత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయములో మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుల స్వామి వార్లకు వెండిరథము ప్రాకరోత్సవమును(ఆలయ ప్రాకరోత్సవము)కార్యక్రమమును నిర్వహించారు. ఈ సందర్బంగా వెండి రథము పైన కొలువు దీరిన స్వామి వారికి సుగంధ పుష్పాలతో, కదిరి మల్లెలు, తులసి మాలతో అలంకరణ గావించి, అస్థాన పూజలు నిర్వహించి ఆలయ ప్రాకరోత్సవము నిర్వహించారు.