కదిరి: డైవర్షన్ రోడ్డులో ఇరుక్కుపోయిన లారీ.. రాకపోకలకు అంతరాయం
కదిరి మండలం ధనియాని చెరువు గ్రామ సమీపంలో చెరువు వద్ద కదిరి- రాయచోటి ప్రధాన రహదారిలో డైవర్షన్ రోడ్డులో శనివారం లారీ ఇరుక్కుపోయింది. గతంలో రోడ్డు పనుల నిమిత్తం ఉన్న బ్రిడ్జిని తొలగించి డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయడంతో బ్రిడ్జిని పట్టించుకోకపోవడంతో ఇటీవల కురిసిన వర్షానికి డైవర్షన్ రోడ్డుకి పక్కన పెద్ద ఎత్తున నీరు నిలబడి డైవర్షన్ రోడ్డు మీద కాలవల నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగిందని వాహనదారులు తెలిపారు.