సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణలో చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం హుస్నాబాద్‌లో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించి ఆయన మాట్లాడారు. సర్వే వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని, ఆందోళన చెందవద్దని చెప్పారు. సమాచారం అంతా గోప్యంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల సర్వేకు ఇబ్బందులు కలిగిస్తున్నారని.. ఇది సరికాదని చెప్పారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పొన్నం కోరారు.