కళ్యాణదుర్గం: మండల పరిధిలోని యర్రంపల్లిలో ఆవుల జాతరను ఘనంగా నిర్వహించారు. సోమవారం ఆవుల జాతర సందర్భంగా శ్రీఎల్లమ్మ దేవుని చుట్టూ గొర్రెలు, పశువులు తిరిగాయి. ఇలా చేయడం వల్ల పశువులకు ఎటువంటి రోగాలు దరి చేరువని అక్కడి ప్రజలు నమ్మకం. దేవుని దర్శనం కోసం ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. వచ్చిన భక్తాదులకు తీర్థప్రసాదాలు పూజారులు అందజేశారు.