నాసా.. చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టనున్న నేపథ్యంలో అక్కడికి తీసుకెళ్లే వస్తువులను సమర్థవంతంగా రీసైకిల్ చేసి, తిరిగి ఏదో ఒక పనికోసం వినియోగించుకోగలిగే పరిశోధనలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం వినూత్న ఐడియాలు ఇచ్చిన వారికి రెండు దశలలో రూ.25 కోట్లు ఇస్తామని ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ‘లూనా రీసైకిల్ చాలెంజ్’ అని పేరు పెట్టింది. ప్యాకేజింగ్ మెటీరియల్, వస్త్రాలు, లోహా భాగాలు, ప్లాస్టిక్ వంటి వాటికి సంబంధించి ఐడియాలివ్వాలని తెలిపింది.