కంబదూరు మండలం అండేపల్లి గ్రామంలో గత 45 రోజులుగా చాకలి కాలనీ, ఎస్టీ కాలనీలకు నీటి సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని సోమవారం ఆ కాలనీ మహిళలు రోడ్డుపై ఖాళీ బిందెలను ఉంచి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో నీటి లభ్యత ఉన్నప్పటికీ, వాటర్ మ్యాన్ లేనందున ఈ సమస్య తలెత్తిందని ఆ గ్రామ మహిళలు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే మరింత ఉదృతంగా నిరసనలు తెలుపుతామన్నారు.