కళ్యాణదుర్గం: చిరుత సంచారంతో భయాందోళనలో గ్రామస్తులు

50చూసినవారు
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామ సమీపంలోని కొండలో నుంచి శుక్రవారం చిరుత సంచారం చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతిరోజు ఇళ్ల దగ్గరికి చిరుత వస్తుందని దీంతో గ్రామస్తులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నామన్నారు. ఈ విషయం పలుమార్లు అటవీ శాఖ అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్