వేంపల్లి: భారత రాజ్యాంగ పరిరక్షణ మన కర్తవ్యం
భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతి భారతీయుడి కర్తవ్యం, బాధ్యతని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. స్వర్గీయ అంబేడ్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్ గా లిఖించబడిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత, అత్యుత్తమ రాజ్యాంగమని కొనియాడారు.