పులివెందుల:శిల్పారామంలో సాంస్కృతికకార్యక్రమాలు నిలుపుదల
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పులివెందుల పట్టణంలోని శిల్పారామంలో వారం రోజులపాటు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగవని శిల్పారామ ఏఓ సుధాకర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేదని, జనవరి 1వ తేదీన నిర్వహించే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేయడం జరిగిందన్నారు.